Shoaib Akhtar: నేను ఆడుంటే భారత్ World Cup గెలిచేదే కాదు *Cricket || Telugu Oneindia

2022-06-12 735

Former Pakistan Pacer Shoaib Akhtar Recalls The Loss Against India in 2011 World cup

#Worldcup
#ShoaibAkhtar
#teamindia


2011 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో తాను ఆడుంటే టీమిండియా ఆ టోర్నీలో విజేతగా నిలిచేది కాదని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. ఆ టోర్నీ సెమీ ఫైనల్లో భారత్, పాక్ తలపడ్డాయి. మొహాలీ వేదికగా జరిగిన ఈ హైటెన్షన్ మ్యాచ్‌లో పాక్‌ను ఓడించి భారత్ ఫైనల్ చేరింది. ఫైనల్లో శ్రీలంకను మట్టికరిపించి 28 ఏళ్ల కలను సాకారం చేస్తూ రెండోసారి ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడింది. అయితే నాటి సెమీఫైనల్ మ్యాచ్‌లో అక్తర్ ఆడలేదు. ఫిట్‌‌గా లేడని అతన్ని పక్కనపెట్టారు. తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాటి సెమీఫైనల్ ఆడుంటే భారత్ తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేదన్నాడు.